telugu navyamedia
crime news Telangana

కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

Accident

తెలంగాణలో ఓ స్కూలు బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని తాడ్వాయి మండలంలోని దేవాయిపల్లి గ్రామంలో వేగంగా వెళుతున్న ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది విద్యార్థులు ఉన్నారు.

కాగా, ఈ ఘటనలో ఎవ్వరికీ తీవ్రగాయాలు కాలేదు. బస్సు పక్కకు ఒరిగిపోవడాన్ని గమనించిన స్థానికులు రైతులు వెంటనే పిల్లలను బయటకు తీశారు. స్కూలు పిల్లలను తీసుకెళ్లేందుకు పాత బస్సును నాడూతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.ఎన్నిసార్లు తాము ఫిర్యాదు చేసినా స్కూలు యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉండి చోద్యం చూస్తున్నారు: పొన్నాల

vimala p

పసుపుకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలి: ఎంపీ అరవింద్

vimala p

చైనాపై ఎందుకు మాట్లాడటం లేదు?: ఇమ్రాన్ ను ప్రశ్నించిన అమెరికా

vimala p