telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా … భారీ నోటిఫికేషన్‌..

sbi po notification as per EBC quota

దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకుల్లో ఒకటైన ఎస్‌బిఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దాదాపు రెండు వేల ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ లో అగ్రవర్ణాల పేదల కోటా (ఇబిఎస్‌), బాండ్‌ వంటివి అమల్లోకి వచ్చాయి. ఎప్పటిలానే ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌లలో ప్రతి సెక్షన్‌కు నిర్దేశిత సమయం ఇచ్చినప్పటికీ, సెక్షనల్‌ కటాఫ్‌ మార్కు పద్ధతి రెంటిలోనూ లేదు. టోటల్‌ కటాఫ్‌ మార్కుకే ప్రాధాన్యం. ప్రిలిమినరీ అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్‌ ఎగ్జామ్‌, గ్రూప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ప్రాతిపదికగా మాత్రమే తుది ఎంపిక ఉంటుంది.

మెయిన్‌ ఎగ్జామ్‌ 250 మార్కులకు ఉంటుంది. దీన్ని 75 శాతానికి పరిమితం చేశారు. అంటే 250కు వచ్చిన మార్కులను 75 శాతంగా తీసుకుని లెక్కిస్తారు. అలాగే గ్రూప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌, ఇంటర్వ్యూకు నిర్దేశించిన 50 మార్కులకు వచ్చిన వాటిని 25 శాతంగా తీసుకుంటారు. ఈ రెంటినీ కలిపి వంద శాతానికి తీసుకుని తుది మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. ఎస్‌బిఐ పీఓ పోస్టుకు ఎంపికైన వారు బ్యాంకులో చేరడానికి ముందే ఆన్‌లైన్‌లో ‘బేసిక్‌ నాలెడ్జ్‌ కోర్సు’ చేయాలి. ఆ కోర్సులో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులు మూడు సంవత్సరాలు పని చేస్తామని రెండు లక్షల రూపాయలకు బాండ్‌ ఇవ్వాలి. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ళు ప్రొబేషన్‌ ఉంటుంది. ఈ సమయంలో కనిష్ఠ వార్షిక ప్యాకేజ్‌ రూ.8.20 లక్షలు. అదే నగరాల్లో అయితే గరిష్ఠంగా రూ.13.08 లక్షలు. పోస్టులో చేరగానే జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ క్యాడర్‌ ఇస్తారు. ప్రొబేషన్‌ కాలంలో వారి పని తీరును నిరంతరం మూల్యాంకన చేస్తారు. ఎస్‌బిఐ నిర్దేశిత ప్రమాణాలకు చేరుకున్న అభ్యర్థులను రెగ్యులరైజ్‌ చేయడానికి తోడు వెన్వెంటనే మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాడర్‌ స్థాయిని ఇస్తారు. కనీస ప్రమాణాలను సాధించని పక్షంలో టెర్మినేట్‌ చేస్తారు. అలాగే బ్రిలియంట్‌ అధికారులకు మంచి వేతనంతో విదేశాల్లోని బ్రాంచుల్లో పని చేసే అవకాశం కల్పిస్తారు.

పీఓ పరీక్షను జనరల్‌, ఒబిసి, ఇబిఎస్‌ అభ్యర్థులు నాలుగుసార్లు రాయవచ్చు. జనరల్‌, ఒబిసి, ఇబిఎస్‌ వికలాంగ వర్గాల అభ్యర్థులు ఏడు సార్లు రాయవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. ఛాన్స్‌ల పరిమితి ప్రిలిమినరీకి వర్తించదు. గతంలో ప్రిలిమినరీ, మెయిన్‌ ఉండేవి కాదు. ఇప్పుడు రెంటిగా విభజించినందున మెయిన్‌కు మాత్రమే ఛాన్స్‌ల పరిమితి నిబంధనను వర్తింపజేశారు. ఈ లెక్కను 2010 ఏప్రిల్‌ 18 నుంచి పరిగణనలోకి తీసుకుంటారు. అంతకు ముందు రాసిన వాటితో పట్టింపు లేదు. గతంలో ఎస్‌బిఐ అలాగే అనుబంధ బ్యాంకులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు వచ్చేవి. అన్నింటినీ కలిపేసినందుకు ఒకే నోటిఫికేషన్‌ రావటం ఇప్పటినుంచి మొదలైంది. అంటే ఎస్‌బిఐ పిఒ, క్లరికల్‌, స్పెషలిస్ట్‌ పోస్టుల కోసం వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లు మాత్రమే వెలువడతాయి. అంతే తప్ప వేర్వేరుగా కలిపి ఆరు నోటిఫికేషన్లు రావు. తద్వారా రాసే ఛాన్స్‌లు కూడా తగ్గాయని అభ్యర్థులు గుర్తించాలి.

కేటగిరీల వారీగా ఖాళీలు :
జనరల్‌: 1010, ఓబీసీ: 540, ఎస్సీ: 300, ఎస్టీ: 150, ఇబిఎస్‌: 200. (మొత్తం: 2000 పోస్టులు)

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ :
ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఈ పేపర్‌కు కేటాయించిన మొత్తం మార్కులు 100. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి..
విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 30 30 20 ని.
క్వాంటిటేటివ్‌
ఆప్టిట్యూడ్‌ 35 35 20 ని.
రీజనింగ్‌
ఎబిలిటీ 35 35 20 ని.
మొత్తం 100 100 60 ని.

ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ప్రకారం కేటగిరీల వారీగా మెరిట్‌ లిస్టును రూపొందిస్తారు. ఈ జాబితా ఆధారంగా ప్రతి కేటగిరీలో ఖాళీలకుమించి పది రెట్ల మందిని మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. అంటే దాదాపు 20 వేల మందికి మెయిన్‌కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.

మెయిన్‌ ఎగ్జామినేషన్‌ :
ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్టుల కలయికగా ఉంటుంది. రెంటినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఇందుకు మూడున్నర గంటల సమయం ఉంటుంది.
ఆబ్జెక్టివ్‌: ఆబ్జెక్టివ్‌ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌: ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ తరవాత డిస్ర్కిప్టివ్‌ విభాగాన్ని కొనసాగిస్తారు. ఇందులో రెండు ప్రశ్నలు ఉంటాయి. వీటికి అర్థ గంట (30 నిమిషాలు)లో సమాధానాలను రాయాలి.
డిస్ర్కిప్టివ్‌ విభాగాన్ని అభ్యర్థుల ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఆంగ్లంలో ఒక లేఖ, ఒక వ్యాసం రాయాల్సి ఉంటుంది. రెంటికీ కలిపి 50 మార్కులు కేటాయించారు. వీటికి సమాధానాలను కంప్యూటర్‌ మీద టైప్‌ చేయాలి. ఇందులో అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత సాధించాలి.
రుణాత్మక మార్కులు: రుణాత్మక (నెగిటివ్‌) మార్కులు కూడా ఉన్నాయి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లో తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వరు.

మెయిన్‌ – ఆబ్జెక్టివ్‌ పరీక్ష స్వరూపం :
విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్‌ కంప్యూటర్‌
ఆప్టిట్యూడ్‌ 45 60 60 ని.
డేటా అనాలిసిస్‌
ఇంట్రప్రిటేషన్‌ 35 60 45 ని.
జనరల్‌ /ఎకానమీ/
బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 40 40 35 ని.
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 35 40 40 ని.
మొత్తం 155 200 180 ని.

ముఖ్య సమాచారం :
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఏప్రిల్‌ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 22
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: జూన్‌ 8, 9, 15, 16.
ప్రిలిమినరీ ఎగ్జామ్‌ సెంటర్లు: హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జూ మెయిన్‌ పరీక్ష తేదీ: జూలై 20
మెయిన్‌ ఎగ్జామ్‌ సెంటర్‌: హైదరాబాద్‌
వెబ్‌సైట్‌: www.sbi.co.in/careers

Related posts