telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ!

sbi logo

వడ్డీ రేట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. నెలలో వరుసగా రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.5శాతం తగ్గిస్తున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది. టర్మ్ డిపాజిట్ రేట్లపై తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయి.

రిటైల్ టర్మ్ డిపాజిట్ల రేట్లను 10-50 బేసిస్ పాయింట్లు, బల్క్ టర్మ్ డిపాజిట్ రేట్లను 30-70 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు బ్యాంక్ తెలిపింది. 7 నుంచి 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గించింది. తగ్గించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్టేట్ బ్యాంకు పేర్కొంది. 46 – 179 రోజులు, 180 రోజుల నుంచి సంవత్సరం వరకు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది.

Related posts