telugu navyamedia
business news news study news trending

ఎస్‌బీఐలో క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తులు

sbi logo

ఎస్‌బీఐలో కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల జనవరి 2న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 8,134 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7870 ఉండగా.. 134 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇక స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 130 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 3న ప్రారంభమైంది. జనవరి 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

పోస్టుల వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య : 8,134

పోస్టుల కేటాయింపు ఖాళీలు
రెగ్యులర్ పోస్టులు 7,870 (ఏపీ-150, తెలంగాణ-375)
బ్యాక్‌లాగ్ పోస్టులు 134
స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 130
మొత్తం ఖాళీలు 8,134

అర్హత: 01.01.2020 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.01.2020 నాటికి 20 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1992 – 01.01.2000 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

పరీక్ష ఫీజు
దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా.

పరీక్ష విధానం

SBI

జీతం: రూ.11,765-655/ 3-13730-815/ 3-16175-980/ 4-20095-1145/7-28110-2120/ 1-30230-1310/1-31450. ప్రారంభంలో బేసిక్ పేగా రూ.13,075 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల-02.01.2020
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం-03.01.2020
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది-26.01.2020
ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లు – 2020 ఫిబ్రవరిలో
ప్రిలిమినరీ పరీక్ష – 2020 ఫిబ్రవరి/ మార్చి.
మెయిన్ పరీక్ష తేది – 19.04.2020.
మెయిన్స్ ఫలితాలు – 2020 జూన్‌లో.

Related posts

బీసీలు రాజకీయంగా ఎదగకుండా కుట్రలు : కృష్ణయ్య

vimala p

అల వైకుంఠపురంలో : ఫ్యాన్సీ రేటుకు డిజిటల్, శాటిలైట్ రైట్స్

vimala p

“సామజవరగమన” వీడియో సాంగ్

vimala p