telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు తీసుకోవాలంటే ఓటీపీ తప్పనిసరి!

ATM

ఎస్‌బీఐ ఏటీఎంలలో రూ.10 వేలు లేక అంతకంటే కంటే ఎక్కువ డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ నిబంధన రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే ఉండేది. ఇక నుంచి 24 గంటల పాటు ఈ నిబంధన అమల్లోకి రానుంది.

ఈ నెల 18 నుంచి రూ.10వేలు లేక అంతకంటే ఎక్కుడ నగదు తీసుకుంటే డెబిట్ కార్డు పిన్‌ నంబరునే కాకుండా ఓటీపీని కూడా నమోదు చేయాల్సిందేనని ఎస్‌బీఐ తెలిపింది.ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు క్రెడిట్‌ స్కోరు తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఆ బ్యాంకు తెలిపింది.

అమెరికాలో మాదిరిగా పలు అంశాలను తాము కూడా పలు సదుపాయాలు కల్పించాలనుకుంటున్నట్లు చెప్పింది. క్రెడిట్‌కార్డు ఉన్న వారు వారి ఖాతా నుంచి క్రెడిట్‌ స్కోరు తెలుసుకునేందుకు ఖాతాలోకి లాగిన్‌ అయినప్పుడు తెలుసుకోవచ్చని తెలిపింది.

Related posts