telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య” టీజ‌ర్ విడుద‌ల‌

UU

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు అందిస్తోన్న మ‌రో కంటెంట్ బేస్డ్ మూవీ `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌`.ఆర్కా మీడియా వ‌ర్క్స్,  మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య‌దేవ్  హీరోగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 17న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు.  మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శుక్ర‌వారం చిత్ర బృందం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. వి.కె.న‌రేశ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మ‌ని టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. స‌త్య‌దేవ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని లుక్‌తో క‌న‌ప‌డుతున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న ఫొటోగ్రాఫ‌ర్‌గా క‌న‌ప‌డుతున్నారు. టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ – “డైరెక్ట‌ర్ వెంక‌ట్ మ‌హా మ‌న నెటివిటీకి త‌గిన‌ట్టు మంచి ఎమోష‌న్స్‌తో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌` సినిమాను అద్భుతంగా మ‌లిచారు. అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17, 2020 విడుల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్ర‌హీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్ర‌భాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Related posts