telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సత్యదేవ్ హీరోగా ‘తిమ్మరుసు’

Thimmarusu

విలక్షణ నటుడు సత్యదేవ్‌ హీరోగా ‘తిమ్మరుసు’ అనే సినిమా తెరకెక్కనుంది. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ట్యాగ్‌లైన్‌. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభంకానున్న ఈ సినిమా టైటిల్‌ లోగోను సోమవారం విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రమని తెలియజేసేలా రూపొందిన ఈ టైటిల్ లోగో ఆసక్తిని రేపుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్‌తో ‘118’ అనే థ్రిల్లర్‌తో పాటు కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్‌ ఇండియా’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’, ‘సూర్యకాంతం’ వంటి డిఫరెంట్ మూవీస్‌ను అందించిన నిర్మాత సృజన్‌ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బ్లఫ్‌ మాస్టర్‌’తో హీరోగా మెప్పించిన సత్యదేవ్‌ రీసెంట్‌గా విడుదలైన విలక్షణ చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలోనూ వైవిధ్యమైన టైటిల్‌ రోల్‌ను పోషించి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

Related posts