telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఏఏ పై… సత్య నాదెళ్ల..

satyanadella

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తాజాగా సీఏఏపై భారతీయ సంతతికి చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తీవ్రంగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం బాధను, విచారాన్ని కలిగిస్తోందన్నారు. వివాదాస్పదమైన సీఏఏకు వ్యతిరేకంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక కొర్పొరేట్‌ దిగ్గజం వ్యాఖ‍్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. బెన్ స్మిత్ ట్విటర్లో చేసిన షేర్‌ చేసిన వివరాల ప్రకారం సీఏఏ తర్వాత దేశంలో జరుగుతోన్న పరిణామాలు మాత్రం మంచిది కాదని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి భారతదేశం వచ్చి.. తదుపరి ఇన్ఫొసిస్ కంపెనీ సీఈవో చూడాలని కోరుకుంటున్నానన్న సత్య నాదెళ్ల వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్మిత్‌ ట్వీట్‌ చేశారు.

మైక్రోసాఫ్ట్ ఇండియా విడుదల చేసిన ఒక ప్రకటనలో, నాదెళ్ల ఇలా అన్నారు. ప్రతి దేశం తన సరిహద్దులను నిర్ణయించుకుంటుంది. నిర్ణయించుకోవాలి కూడా. తదనుగుణంగా జాతీయ భద్రతను కాపాడుకోవాలి, ఇమ్మిగ్రేషన్ విధానాన్ని నిర్దేశించాలి. అదే సందర్భంలో ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు, వారి ప్రభుత్వాలు ఆ హద్దులలో చర్చించి నిర్వచించి నిర్దేశించుకోవాల్సిన విషయం ఇది అని పేర్కొన్నారు. భారతీయుడిగా పుట్టాను, బహుళ సాంస్కృతిక వాతావరణాల్లో పెరిగాను. వలసదారునిగా అమెరికాలో ఉన్నారు. ఒక సంపన్నమైన ప్రారంభాన్ని కనుగొనాలని లేదా భారతీయ సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ప్రయోజనం చేకూర్చే బహుళజాతి సంస్థను నడిపించాలని ఒక వలసదారుగా తన ఆశ అంటూ న్యాయపరంగా వచ్చే వలసదారులతో దేశ ఉన్నతికి దోహదపడుతుంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

Related posts