telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఫ్యాన్సీ ధర పలికిన మహేష్ సినిమా…

మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్కారు వారిపాట ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. టైటిల్ ను అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి . ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలా ఆధారంగా ఉంటుందని వార్తలు షికారు చేస్తున్నాయి. మహేష్ ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నాడట. మహేష్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రేట్లు భారీగా పలికినట్టు తెలుస్తుంది. సర్కారు వారి పాట చిత్రాన్ని కూడా తమిళంతో పాటు ఇతర భాషలలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం తమిళ శాటిలైట్‌, డిజిటల్ రైట్స్‌ని ఓ ప్రముఖ టీవీ  ఛానల్ దక్కించుకుందట. మహేష్ నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలోనే అక్కడ విడుదల అవుతున్నాయి. మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ నటించిన స్పైడర్ సినిమా తమిళ్ లో కూడా విడుదలైంది. ఇలా మహేష్ కు అక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. గతంలో తమిళ్ లో మహేష్ ఏ సినిమాకు దక్కని ఆఫర్ ఈ సినిమాకు దక్కిందని తెలుస్తుంది. సదరు ఛానల్ సర్కారు వారిపాట సినిమా శాటిలైట్‌, డిజిటల్ రైట్స్‌ ను భారీ మొత్తంలో దక్కించుకుందట. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.

Related posts