• Home
  • Trending Today
  • “సర్కార్” టీజర్… యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటున్న ఇళయదళపతి
Trending Today సినిమా వార్తలు

“సర్కార్” టీజర్… యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటున్న ఇళయదళపతి

vijay Sarkar

స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం “సర్కార్”. ఈ సినిమాలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా కన్పించబోతున్నాడట. ఈ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. గతంలో వీరి కాంబినేషన్‌ లో తెరకెక్కిన తుపాకి, కత్తి సినిమాలు ఘన విజయం సాధించటంతో సర్కార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సన్‌ పిక్చర్స్‌ భారీ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కీర్తి సురేశ్ హీరోయిన్ గా కనిపిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రాధారవి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులని అశోక్ వల్లభనేని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. “ఐ యామ్ ఏ కార్పొరేట్ క్రిమినల్” అంటూ యాటిట్యూడ్ తో విజయ్ చెప్పిన డైలాగ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ తోనే అభిమానుల అంచనాలను అందుకోగలిగారు విజయ్. పొలిటికల్ థ్రిల్లర్ నేపధ్యంలో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా దీపావళి సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

వర్మ ట్వీట్ వైరల్ అయ్యింది తెలుసా?

admin

జనవరి 26న 'సైనిక'

admin

అంజలి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… తెలిస్తే షాకే…!?

vimala t

Leave a Comment