• Home
  • Trending Today
  • సారిడాన్ మందులు వాడుతున్నారా…వెంటనే ఆపేయండి…ఎందుకంటె..
Trending Today ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు రాజకీయ వార్తలు వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సమీక్ష వార్తలు సాంకేతిక సామాజిక

సారిడాన్ మందులు వాడుతున్నారా…వెంటనే ఆపేయండి…ఎందుకంటె..

saridon and some medicines banned by govt

ప్రభుత్వానికి, ఫార్మా సంస్థల మధ్య మందుల తయారీలో మొదట నుండి ఉన్న విభేదాలు మరింత ముదిరాయి. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్.డి.సి) డ్రగ్స్ విషయంలో ఆయా సంస్థలు నియమనిబంధలను పెడచెవినపెట్టి ఉత్పత్తి చేయటం, అమ్ముకోవటం తో చేసేది లేక ఇవన్నీ నివారించి వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిషేదించింది ప్రభుత్వం. గతం నుండే ఇలాంటివి చేస్తున్నా కూడా ఫార్మా సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో దీనిపై కమిటీ ఏర్పాటు చేయటం, అది ఇచ్చిన నివేదిక ప్రకారం 328 ఎఫ్.డి.సి లను నిషేదించారు. వీటిని ఆయా సంస్థలు 6000 బ్రాండ్లతో కనీసంలో కనీసం 2 నుండి రెండువేల ఐదువందల కోట్ల వరకు అమ్ముకొని సంపాదిస్తున్నారు.

రెండు ఏళ్ళ క్రితమే ప్రభుత్వం 349 ఎఫ్.డి.సి లను నిషేదించగా, ఫార్మా సంస్థలు కోర్టుకు వెళ్లడంతో వాటిలో 328 ప్రమాదకరమైనవిగా నివేదిక అందిన కోర్ట్ వాటిని నిషేదించినట్టు ప్రకటించింది. యాక్ట్ 1940 చట్టంలోని సెచ్ 6ఏ ప్రకారం వీటిని నిషేదించింది. నిషేదించిన వాటిలో సారిడాన్ తో పాటు చర్మవ్యాధులకు వాడే పాన్ డెర్మ్, ఆల్కెమ్ ల్యాబోరేటరీ కి చెందిన టాక్సిమ్ ఏ జెడ్, మొక్లోడ్స్ ఫార్మా ఫండేమ్ ఫ్లస్ క్రీం లను ప్రభుత్వం నిషేదించింది. ఆయా సంస్థలు ఈ ఉత్పత్తులను తయారుచేయడం ఆపివేయాలి, అలాగే ఉన్నవి పంపిణి, విక్రయం కూడదు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 

Related posts

గణేశ్ మండపం వెనకే అత్యాచారాలు … 13 ఏళ్ల బాలిక

jithu j

ట్విట్టర్ వేదికగా బీజేపీ పై రాహుల్ ఫైర్..

admin

నేను చేసిన సేవలే నన్నింతటి స్థాయికి తీసుకొచ్చాయి… లారెన్స్

nagaraj chanti

Leave a Comment