telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు

చీరతో .. ట్రాఫిక్ తిప్పలు.. రూ. 20కే..

saree discount makes huge traffic issue

చీర వాహన దారులకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. అసలే ఇరుకు రోడ్లు, దానిలో మళ్ళీ చీర రూ.20కే దొరుకుతుందని తరలివచ్చేసిన మహిళలు.. రోడ్డుపై పాదచారి వెళ్లేందుకు కూడా గంటలబట్టి ఇబ్బందిపడ్డారు వాహనదారులు. స్థానికంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మేన్‌రోడ్ చౌరస్తాలోని శ్రీకనుకదుర్గ సిల్క్స్ నిర్వాహకులు రూ.20కే చీర అని ప్రచారం చేయడంతో పెద్దపల్లి పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన మహిళలు భారీ సంఖ్యలో షోరూమ్‌కు తరలివచ్చి బారులు తీరారు. చీరలు కొనుక్కునేందుకు ఎగబడ్డారు. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పాటు తోపులాట జరిగింది.

ఇంత మంది మహిళలను అదుపు చేసేందుకు పోలీసులు అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో మేన్‌రోడ్ నుంచి వెళ్లే ద్విచక్ర వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 2 గంటల పాటు మసీద్ ఏరియాలోని మేన్‌రోడ్ మహిళలతో నిండిపోయింది. అధిక సంఖ్యలో మహిళలు రావడం, ఉన్న చీరలన్నీ అమ్ముడుపోవడంతో విధిలేని పరిస్థితిలో షాపు యజమాని దుకాణాన్ని మూసివేశాడు. దీంతో మహిళలు అసహనానికి గురయ్యారు. రూ.20 పెడితే జేబు రుమాలు రాని రోజుల్లో రూ.20లకు చీర అనే ప్రచారంతో మహిళలు భారీగా తరలివచ్చి చీరలు దొరకపోవడంతో నిరాశకు గురయ్యారు.

Related posts