telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పక్క తెలంగాణ పాటతో వచ్చేసిన సాయిపల్లవి

అక్కినేని హీరో నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథగా రూపొందింది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాట ప్రోమోలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే ఆకర్షించాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, హే పిల్లా పాటతో ఆకట్టుకుంది. అయితే.. తాజాగా ఈ సినిమాలోని “సారంగా దరియా” అంటూ సారిపోయే పూర్తి లిరికల్‌ పాట వీడియోను అక్కినేని సమంత రిలీజ్‌ చేశారు. స్వతహాగా డ్యాన్సర్‌ అయిన సాయిపల్లవి తన డ్యాన్స్‌ స్టెప్పులతో అలరించింది. జానపద పాలను ఎక్కువగా ఇష్టపడే శేఖర్‌ కమ్ముల ఈ పాటను ప్రత్యేకంగా మలిచినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమా ఏప్రిల్‌ 16న థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

Related posts