telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

75 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన సారంగదరియా…

ఈ మధ్య ప్రతి సినిమా నుండి వస్తున్న ఏదో ఒక్క పాట సంచలన రేపుతోంది. విడుదలకు ముందే ఆ ఆసినిమా పై అంచనాలను తార స్థాయికి ఏతెస్తుంది. అలాంటి పాటె సారంగదరియా. లవ్ స్టోరీ సినిమా నుండి విడుదలైన ఈ పాట సంచలన సృష్టిస్తుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ నుండి ఈ పాట విడుదల కాగానే యు ట్యూబ్ లో తుఫాన్ వేగంతో వ్యూస్ దూసుకుపోయాయి. ఇక ఆ పాట వివాదాస్పదం అవటంతో మరింతగా క్రేజ్ తెచ్చుకుంది. తక్కువ టైమ్ లో ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా రికార్డ్ సృష్టించింది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట ఇప్పుడు యుట్యూబ్ ని షేక చేస్తూ 75 మిలియన్ల వ్యూస్ ని సాధించి 100 మిలియన్స్ వైపు గా దూసుకుపోతోంది. నారాయణదాస్ నారంగ్, పుష్కర రామ్మోహనరావు నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 16న ఉగాది కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ పాట మరో కొద్ది రోజులోనే 100 మిలియన్ క్రాస్ చేసేలా కనిపిస్తుంది.

Related posts