telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్…!

Sara

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ “కేదారనాథ్” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో సుశాంత్ రాజ్ పుత్ కథానాయకుడు. ఈ సినిమాలోని బోల్డ్ సీన్స్ లో కూడా వీరు బాగా నటించడంతో తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు ఈ సినిమాతో సారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. తరువాత రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి “సింబా” చిత్రంలో కూడా మెరిసింది సారా. తాజాగా సారా త‌ను కాలేజ్ డేస్‌లో ఉన్న‌ప్పుడు దిగిన ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది సారా. ఈ ఫోటోలో సారాని చూస్తుంటే దాదాపు 90 కేజీల‌కి పైగానే బ‌రువు ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ఆమె కూడా ఆ విష‌యాన్ని తెలిపింది. నటనపై ఆసక్తి ఉందని సారా ఇంట్లో చెప్పినప్పుడు… ముందు నువ్వు లావు తగ్గాకే సినిమాల గురించి ఆలోచించు అని ఆమె తల్లి అమృతా సింగ్ కండిషన్ పెట్టిందట. ఆ సమయంలో ఫిజిక్ పై దృష్టి పెట్టి ప్రస్తుతం ఉన్న లుక్ సాధించానని సారా తెలిపింది. తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ సారా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sara-1

Related posts