telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ పై నెటిజన్లు ఫైర్

Sara-Ali-Khan

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా సారా ఓ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. అందులో ఆఫ్రికన్ తెగకు చెందిన ఓ వ్యక్తి పక్కన నిలబడి ఆ ఫోటోషూట్ లో ఫోటోలకు ఫోజిచ్చింది సారా. ఈ ఫోటోషూట్ కెన్యాలో నిర్వహించగా ఇటీవల సదరు మ్యాగజైన్ విడుదల చేసింది. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు మాత్రం నీ ఫోటోల కోసం ఒక మనిషిని వస్తువులా ఎలా వాడుకుంటావు అంటూ మండిపడుతున్నారు. ఆఫ్రికన్లు మీ ఫోటోషూట్ కోసం వాడుకునే వస్తువులా కన్పిస్తున్నారా ? అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. సాటి మనిషిని అవమానించే విధంగా ఈ ఫోటో ఉందని, వెంటనే డిలీట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురిగా బాలీవుడ్ లో “కేధార్ నాథ్” చిత్రంతో వెండితెరకు పరిచయమైంది సారా. ఇటీవల “సింబా” చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సారా అలీఖాన్.

Related posts