telugu navyamedia
సినిమా వార్తలు

సంక్రాంతి శోభ…

sankranthi holidays dates may vary

గొబ్బెమ్మలు, రేగు పళ్ళు
సిరి ధాన్యాలతో
హరివిల్లులను మరిపించే
రంగవల్లులతో
కళాక్షేత్రాలయ్యే  ఇంటింటి ముంగిళ్ళు.

హరిదాసుల కీర్తనలు
బసవన్నల నాట్యాలు
తరతరాల తెలుగు సంస్కృతిని
చాటిచెప్పే జానపద కళారూపాలు.

మనో మాలిన్యాలను
మానసిక జాడ్యాలను
వదిలించుకోవాలని సూచించే
భోగి మంటలు.

చిన్నారులను
నిండు నూరేళ్ళూ జీవించమని
ఆశీర్వదించే 
భోగి పళ్ళ ఉత్సవాలు.

కొత్త అల్లుళ్ళు
బావ మరదళ్ళ సరస సల్లాపాలు
కొత్త ధాన్యం
చక్కెర పొంగళ్ళతో
నవనవలాడే ఇంటి లోగిళ్ళు.

కోడి పందాలు
కోడెల అందాలు
గాలి పటాల గలగలలు
పిన్నా పెద్దల కేరింతలతో
అంబరాన్నంటే సంబరాలు.

పల్లె ప్రియురాలి అందాల వీక్షణకై
పట్నం ప్రియుడి పయనాలు.
సంక్రాంతి శోభను చూసి 
తరించే నయనాలు.

-సిరా (సింగారపు రాజయ్య),
ఇల్లందు

Related posts