• Home
  • వార్తలు
  • మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ అరెస్ట్
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ అరెస్ట్

Sanjiv Bhatt, Retired Ips, Gujarat riots

గుజరాత్ మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 22 ఏళ్ల క్రితం ఓ క్రిమినల్ కేసులో ఓ లాయర్‌పై తప్పుడు అభియోగాలు మోపారంటూ 1998లో ఆయనపై కేసు నమోదైంది. గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు భట్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఆయనతో పాటు మరో ఆరుగురిని కూడా గుజరాత్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ వివరాలను సీఐడీ డీజీపీ ఆశిష్ భాటియా బుధవారం మీడియాకు వెల్లడించారు.

1998లో ఓ లాయర్‌ను అక్రమంగా మాదక ద్రవ్యాల కేసులో ఇరికించినట్టు భట్‌పై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆయన బనస్కాంత ప్రాంతంలో డీసీపీగా పనిచేశారు. 2002 గుజరాత్ అల్లర్ల వెనుక నరేంద్రమోదీ హస్తం ఉందని ఆరోపిస్తూ 2011లో సంజీవ్ భట్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను జూన్ లో సీఐడీకి అప్పగించిన హైకోర్టు 3 నెలల్లోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సంపాదించిన సీఐడీ అధికారులు భట్ సహా 8 మంది పోలీసులను అరెస్ట్ చేశారు. 2015లో విధులకు సక్రమంగా హాజరుకావడం లేదన్న కారణంతో భట్ ను కేంద్రం సర్వీస్ నుంచి తొలగించింది.

Related posts

రాధిక కొత్త సినిమా ఫోటో లీక్… కళ్ళజోడు పెట్టుకొని హాట్ అందాలతో…

nagaraj chanti

కేసీఆర్ కు జాతీయ మీడియా సంస్థ.. అవార్డు…శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్…

chandra sekkhar

కొత్తగూడెంలో పవన్ కళ్యాణ్..

admin

Leave a Comment