telugu navyamedia
సినిమా వార్తలు

వచ్చే ఏడాది ఈద్ కు సల్మాన్ కొత్త చిత్రం… 20 ఏళ్ళ తరువాత కాంబినేషన్ రిపీట్

Salman-Khan-and-Alia-Bhatt

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన “భారత్” చిత్రం ఈద్ కానుక‌గా విడుద‌లై హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. గ‌తంలో రేస్, ట్యూబ్‌లైట్ త‌దిత‌ర చిత్రాల‌ని ఈద్ కానుక‌గా విడుద‌ల చేసిన స‌ల్మాన్ మంచి విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు “భారత్” చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ని కొల్లగొడుతోంది. అయితే వచ్చే ఏడాది ఈద్‌కి కూడా స‌ల్మాన్ చిత్రం విడుద‌ల కానుంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రంలో అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. “ఇన్షా అల్లా” అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేశారు. 1999 లో వ‌చ్చిన “హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్” అనే చిత్రం కోసం స‌ల్మాన్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ క‌లిసి ప‌ని చేశారు. 20 ఏళ్ళ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ప్రాజెక్ట్ రానుండ‌డంతో అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న అలియా త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంది.

Related posts