telugu navyamedia
సినిమా వార్తలు

స్టార్ హీరో కూతురి ప్రియుడి మరణం… గుండె పగిలింది…

Trishala

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూతురు త్రిషాల దత్ తన ప్రియుడు గురించి చేసిన వ్యాహ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ”నా గుండె పగిలింది.. నన్ను ఎంతగానో ప్రేమించినందుకు.. నా గురించి శ్రద్ధ వహించినందుకు కృతజ్ఞతలు.. నా జీవితంలో ఎన్నడూ పొందనంత సంతోషాన్ని నువ్వు నాకు అందించావు. నీ ప్రేమను పొందిన కారణంగా ప్రపంచంలోనే అద్రుష్టవంతురాలైన అమ్మాయిగా భావిస్తున్నాను. నీదాన్ని అయినందుకు మురిసిపోయాను.. నువ్వు నాలో శాశ్వతంగా జీవించి ఉంటావ్.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మళ్లీ నిన్ను కలుసుకునేంతవరకు నిన్ను ఎంతగా మిస్ అవుతానో నాకు మాత్రమే తెలుసు..” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన పోస్ట్ లో తన ప్రియుడి పుట్టినరోజు, మరణించిన రోజుని ప్రస్తావించిన త్రిషాల అతడి గురించి ఇతర విషయాలను వెల్లడించలేదు. పోస్ట్ ని బట్టి అతడు మంగళవారం నాడు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చేస్తున్నారు. త్రిషాల… సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ కూతురనే విషయం తెలిసిందే.

Related posts