telugu navyamedia
sports

నా కొడుకు డాక్టరే .. అంటున్న టెన్నిస్ దిగ్గజం సానియా.. 

sania mirja,son as doctor
అతి తక్కువ కాలంలో తన అద్భుత ప్రతిభతో టెన్నిస్ లో ఉన్నత స్థానాలను సాధించిన క్రీడాకారిణి సానియా వివాహం అవడం, ఆమెకు ఒక కొడుకు పుట్టడం తెలిసిందే. అయితే తాను టెన్నిస్ క్రీడాకారిణి అయినప్పటికీ తన కొడుకును డాక్టర్నే చేస్తానంటూ సానియా ఇటీవల స్పష్టం చేసింది. ఎందుకు అని అడిగితే, టెన్నిస్ క్రీడ ఎంతో కష్టతరంతో కూడుకున్నందని జవాబిచ్చింది. ఎంతైనా తల్లికదా.. కొడుకు మరీ కష్టపడిపోవాల్సి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. 
కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో కళాశాలకు చెందిన 1980 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థులు ఉస్‌మెకాస్ 80 మెగా రీయూనియన్ పేరిట కళాశాలలో వివిధ ప్రాజెక్టులను రూపొందించారు. దీనిలో భాగంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓఎంసీ సింథటిక్ టెన్నిస్ కోర్టును ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం టెన్నిస్ కోర్టులో కాసేపు ఆడి అందరిని అలరించారు. అనంతరం కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన అలుమ్ని అసోసియేషన్ సభ్యులు సానియా మీర్జాకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉస్మానియా మెడికల్ కళాశాల అభివృద్ధికి 1980 అడ్మిషన్ బ్యాచ్ పూర్వ వైద్య విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఉస్‌మెకాస్ 80 ఆధ్వర్యంలో వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా కళాశాలను మెరుగుపర్చే విధానాన్ని అవలంభించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శశికళ, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎ.శ్రీనివాస్, ఓఎంసీ అలుమ్ని అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వై.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐపీఎల్ : రాజస్థాన్ .. ఘనవిజయం..

vimala p

జయసూర్య పై .. పుకార్లు !.. బ్రతికే ఉన్నా అంటూ… జవాబు.. !!

vimala p

2019 ప్రపంచ కప్ : .. నిలకడగా ఆడుతున్న భారత్.. స్టేడియం లో మహేష్ కుటుంబం..

vimala p