telugu navyamedia
సినిమా వార్తలు

రెండేళ్ల తరువాత సీనియర్ హీరోయిన్ రీఎంట్రీ

Sangeetha

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కథానాయికగా సంగీత ఒక వెలుగు వెలిగింది. “పితామగన్‌”లో అద్భుతమైన నటన కనబరిచి దక్షిణాదిన అగ్రతారగా వెలుగొందింది. తెలుగులో “ఖడ్గం” సినిమాలో ఆమె చేసిన పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. వెండితెరపై కనిపించాలనే ఆశతో పల్లె నుంచి పట్నానికి వచ్చి “ఒకే ఒక్క ఛాన్స్” ఇవ్వమని అడిగే అమాయకపు యువతిగా ఆమె పోషించిన పాత్ర మంచి సంగీతకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సంగీత పెళ్లి తరువాత సినిమాలు తగ్గించేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించాక మళ్లీ రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్న సంగీత మళ్లీ ఇప్పుడు “తమిళ రసన్” అనే తమిళ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. విజయ్ ఆంటోని, రమ్య నంబిసన్ నాయకా నాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సంగీత ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. వీరితోపాటు రోబో శంకర్‌, యోగిబాబు, సోనూ సూద్‌, ఛాయా సింగ్‌, మధుమిత, వైజీ మహేద్రన్‌, రాధా రవి తదితరులు నటిస్తున్నారు. ఈ రెండేళ్లలో తనకు వకాశాలు వచ్చినా తన కథాపాత్రలు నచ్చకపోవడంతో వాటిని అంగీకరించలేదని, “తమిళరసన్‌” చిత్రంలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చారు సంగీత. ఈ చిత్రానికి సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

Related posts