telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నియోజకవర్గం కోసం కేసీఆర్ దగ్గర తల వంచుతా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Jagga reddy mla

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దగ్గర తల వంచుతానని అన్నారు. సంగారెడ్డిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం సీఎంకు వ్యతిరేకంగా తాను ప్రకటనలు ఇవ్వనని అన్నారు.

అలాగే ఇంకేవ్వరు కూడా వ్యతిరేఖంగా స్టేట్ మెంట్లు ఇవ్వద్దని చెప్పారు. బీజేపీకి కూడా వ్యతిరేకంగా ప్రకటనలు చేయొద్దని సూచించారు. సంగారెడ్డి అభివృద్ధే తమకు ముఖ్యమని, తాను ఏది చేసినా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల కోసమేనని స్పష్టం చేశారు.

Related posts