telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సంగారెడ్డి ఘటన యొక్క పూర్తి వివరాలు…

సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం పల్వాట్ల గ్రామంలో జరిగిన ఘటన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. ఈ కుటుంబ పెద్ద శంకరమ్మ ఈ నెల 13 వ తేదీ నాడు భిక్షాటన చేసి తెచ్చుకున్న పిండితో చేసిన రొట్టె తిని మృతి చెందింది. శంకరమ్మకు మొత్తం ఐదుగురు కొడుకులు కాగా వీరు అందరూ హైదరాబాద్ లో వివిధ పనులు చేసుకుంటూ ఉంటారు. శంకరమ్మ పెద్దకొడుకు సిద్దయ్య, కొని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా సిద్దయ్య భార్య సుశీల ఈ సంఘటనలో మృతి చెందింది. రెండో కొడుకు చంద్రమౌళి, మృతి చెందగా అతని భార్య అనసూయ పరిస్థితి విషమంగా ఉంది. మూడో కొడుకు కాశీనాథ్ ఇల్లరికం వెళ్లడంతో నిన్నటి కార్యక్రమంలో లేడు దాంతో అయన బతికి పోయాడు.  నాలుగో కొడుకు శ్రీశైలం నిన్నటి సంఘటనలో మృతి చెందాడు. శ్రీ శైలం భార్య సరిత ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఐదవ కొడుకు సంతోష్ మరియు అతని భార్య పద్మ నిన్న నిద్ర చేయడానికి అత్తగారింటికి వెళ్లడంతో వారికి ఈ ప్రమాదం తప్పినట్టు చెప్పచ్చు. నిన్న రొట్టెలు తినకుండా అన్నం తిన్న ముగ్గురు చిన్నారులు కూడా ప్రమాదం నుండి బయట పడ్డారు. మొన్న శంకరమ్మ ఐదు రోజుల కార్యక్రమం కోసం గ్రామానికి వచ్చిన కొడుకులు ఈ కార్యక్రమం  ముగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నారు. ఈ లోపే ఈ ఘటన జరగడంతో శోక సంద్రంలో మునిగి పోయారు కుంటుంబ సభ్యులు.

Related posts