telugu navyamedia
సినిమా వార్తలు

సినిమాను ఆపడానికి వాళ్లు… సందీప్ కిషన్ సంచలన వ్యాఖ్యలు

Sandeep-KIshan

హీరో సందీప్ కిషన్ నటిస్తూ, నిర్మించిన చిత్రం “నిను వీడను నీడను నేనే”. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించగా దయా పన్నెం, సందీప్ కిషన్, వీజీ సుబ్రహ్మణ్యన్ నిర్మించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇక సందీప్ కిషన్ సరసన హీరోయిన్ అన్యాసింగ్ నటించారు. ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్‌తో పాటు సుధీర్ బాబు, నిఖిల్, కార్మికేయతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘‘ అదిరిపోయే సినిమా తీశా. హిట్ పక్కా.. ఫస్ట్ టైమ్ చాలా ధీమాగా చెబుతున్నా. అది నేనొక్కడినే తీశానని చెప్పడం లేదు. ఈ సినిమాలో పడిన కష్టం బాగా కుదిరింది. ‘నిను వీడను నీడను నేనే’ అనే ఈ సినిమా నా కెరీర్‌లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ సినిమా. రోజూ 150 మందికిపైగా భోజనం పెట్టాం. అందరినీ బాగా చూసుకున్నాం. ఎవరినీ మోసం చేయలేదు. గర్వంగా చెబుతున్నా ఒక్క రూపాయి కూడా మోసం చేయలేదు. సినిమాను మాత్రమే తీశాం. సినిమానే ప్రమోట్ చేశాం. సినిమా రిలీజ్ తర్వాత ఆడియెన్స్ నుంచి సినిమానే మాట్లాడుతుంది. నిజం చెప్పాలంటే అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు. అంత టెన్షన్ ఉంది. శివ, సీతారాం లేకపోతే నేను లేను. నాకు మొత్తం వాళ్లే. వాళ్లే నన్ను ఇక్కడి దాకా లాక్కొచ్చారు.

ఒకడు సినిమా తీద్దామంటే.. ఆ సినిమాను ఆపడానికి సంబంధంలేని వాళ్లు కూడా బయల్దేరతారు. కానీ అందరి కన్నా, అన్నిటికన్నా సినిమా గొప్పది. ఆ సినిమాను ఆ సినిమానే కాపాడుకుంటూ వస్తుంది.. అది ‘నిను వీడను నీడను నేనే’. విపరీతమైన హెడ్డింగులు వచ్చాయి. నాకే షాకింగ్. ఇదొక మిరకిల్. సగంసార్లు మేమందరం కూర్చొని ఇలాంటి చిక్కు వచ్చింది. దీన్ని ఎలా క్రాస్ చేస్తాం అని ఆలోచించుకున్నాం. మరుసటి రోజే క్రాస్ అయిపోయింది. కానీ అది ఎలా అయిందో కూడా తెలియదు. ప్రి రిలీజ్ ఫంక్షన్‌పై చాలా హైప్రెజర్, టెన్షన్, ఏం జరుగుతుందో తెలియదు. పక్కకు చూస్తే శివ, సీతారం కనిపించడంలేదు.

ఆఫీస్ బ్యాక్ డోర్‌లో చూస్తే ఓ మూలాన సీతారం ఏడుస్తున్నారు. శివ కన్నా చిన్నపిల్లోడు ఏడిస్తే అందంగా ఉంటుంది. సీతారం ఏడ్చాడంటే చాలా అన్యాయంగా ఉంటుంది. కానీ ఈ సినిమాకు ప్రతి ఒక్కరు బ్లడ్ పెట్టి పని చేశారు. ఈ సినిమాను 12న విడుదల చేయాలని అనుకున్నాం. ఓ నలుగురు ఎవర్ని అడిగి డిసైడ్ చేశావ్ అన్నారు. రిలీజ్ డేట్ నువ్వేలా నిర్ణయం తీసుకుంటావ్ అని అన్నారు. సినిమా నేనే తీశాను. నాకు కావాల్సినప్పుడు నేను రిలీజ్ చేసుకుంటా అని చెప్పా. ఈ నెల 12న సినిమా వస్తుంది. తప్పక చూడండి’’ అని అన్నారు.

Related posts