telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిక్స్ ప్యాక్ తో సందీప్ కిషన్… పిక్స్ వైరల్

Sandeep-Kishan

“నిను వీడ‌ని నీడ‌ను నేనే” చిత్రంతో సూప‌ర్ ‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం “A1 ఎక్స్‌ప్రెస్‌”. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా సినిమా షూటింగ్ నిలిచి పోయింది.ప్రస్తుతం తిరిగి షూటింగ్ లు షురూ అవుతున్న ఈ సమయంలో తన సినిమాను కూడా ప్రారంభించబోతున్నట్లుగా సందీప్ కిషన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.దానికి తోడు రెండు ఫోటోలను షేర్ చేసాడు సందీప్. ఒక ఫొటోలో సిక్స్ ప్యాక్ బాడీని చూపించాడు సందీప్.

Related posts