telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కన్నుమూత

vijayreddy

సినీ ఇండస్ట్రీని ఓ వైపు కరోనా కలకలం సృష్టిస్తుండగా.. మరోవైపు సినీ ప్రముఖుల వరుస మరణాలతో విషాదాలు అలుముకుంటున్నాయి. శుక్రవారం రాత్రి కన్నడ చిత్ర సీమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన సీనియర్ డైరెక్టర్ విజయ్ రెడ్డి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నెలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మయూర; గంధద గుడి, శ్రీనివాస కళ్యాణ, భక్త ప్రహ్లాద, సనాది అప్పణ్ణ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన విజయ్ రెడ్డి.. కన్నడ భాషలో నలబైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్‌లతో ఆయన తెరకెక్కించిన ‘గంధద గుడి’ సినిమాను ఎన్టీఆర్ హీరోగా ‘అడవి రాముడు’గా కె.రాఘవేంద్ర రావు తెలుగులో రీమేక్ చేశారు. విజయ్ రెడ్డి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై రాజ్ కుమార్ కుమారుడు పునీత్ రాజ్ కుమార్ ట్విట్టర్ ద్వారా రాజ్‌కుమార్‌తో ఉన్న విజయ్ రెడ్డి ఫోటోను షేర్ చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసాడు.

Related posts