telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓ చిన్న పిల్లను గర్భిణిని చేశాడు… ప్రియుడి భాగోతం బయటపెట్టిన హీరోయిన్

Sana

బాలీవుడ్ నటి సనా ఖాన్ విషయంలో అదే జరుగుతోంది. ఆమె ప్రియుడు మెల్విన్ లూయిస్‌ మోసం చేసాడని కొన్ని రోజులుగా మండిపడుతున్నారు. రోజూ మెల్విన్‌కు సంబంధించి ఏదో ఒక విషయం బయటపెడుతూనే ఉన్నారు. దాంతో మెల్విన్‌కి ఒళ్లు మండింది. సనా ఖాన్‌ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ఏదో ఒక కామెంట్ పెడుతున్నాడు. దాంతో సనాకు కోపం పీక్స్‌కి వెళ్లిపోయింది. అతని నుంచి నగ్నసత్యాలు ఇవేనంటూ వరసగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టింది. ‘మోసం అనేది పొరపాటున జరగదు. అంతా ప్లానింగ్‌తోనే జరుగుతుంది. చాలా రోజులుగా నేను ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అతని కోసం కాదు. అతను నన్ను పెట్టిన బాధ వల్ల. నా పరిస్థితే ఇలా ఉంటే అతను మోసం చేసిన మిగతా అమ్మాయిల జీవితాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఓ చిన్న పిల్లను గర్భిణిని చేసి వదిలేసాడంట. ఆ విషయం తెలిసి నా గుండె పగిలిపోయింది. ఎందరో అమ్మాయిల నుంచి డబ్బులు తీసుకున్నాడు. డ్యాన్స్ టీచర్ అంటే ఇలా ప్రవర్తిస్తాడా? నాకు భయం వేస్తోంది. అల్లా మీకు తగిన గుణపాఠం చెప్తారు’’ అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు సనా.

Related posts