telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘క్రాక్’ తెప్పిస్తున్న కటారి… సముద్రఖని ఫస్ట్ లుక్ విడుదల

krack

మాస్ మాహారాజా రవితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘క్రాక్’. గతంలో రవితేజతో డాన్‌ శీను, బలుపు లాంటి సూపర్‌ హిట్ సినిమాలను తెరకెక్కించారు గోపీచంద్ మ‌లినేని. ‘క్రాక్’ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ ప్రేక్షకుల నుంచి విశేషాదరణ పొందింది. కాగా తాజాగా ఏప్రిల్ 26 యాక్టర్ సముద్రఖని పుట్టినరోజు కానుకగా ఆయన లుక్ విడుదల చేసి సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. సముద్రఖనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్రాక్ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు ‘కటారి’ అని తెలిపారు. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో సముద్రఖని ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. జయమ్మగా ఆమె అదరగొట్టేయనుంది. మొత్తానికైతే పోస్టర్స్ తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది క్రాక్ టీమ్. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటిస్తుండగా, ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related posts