telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత చేసిన స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే…!

Samantha

టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా దూసుకెళ్తున్న సమంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇటీవలే “ఓ బేబీ” చిత్రంతో ప్రేక్షకులను అలరించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సమంత. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగిన స‌మంత వ‌ర్క్ విష‌యంలో చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. షూటింగ్ స్పాట్ ను టైంకన్నా ముందుగానే వస్తుంది. అయితే ఫిట్‌నెస్ కోసం కూడా చాలా శ్ర‌మ‌ప‌డుతుంటుంది. ఈ విషయం ఆమె గ్లామర్ ను చూస్తేనే అర్థమవుతుంది. తాను జిమ్‌లో చేసే వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన వీడియోల‌ని అప్పుడ‌ప్పుడు షేర్ చేస్తూ ఉండే స‌మంత రీసెంట్‌గా ఓ స్టంట్ వీడియో షేర్ చేసింది. ఇందులో పోల్‌ని ప‌ట్టుకొని రెండు చేతుల‌తో పైకి ఎక్కుతూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. స‌మంతలో దాగి ఉన్న సామ‌ర్ద్యాన్ని చూసి నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు. ఈ వీడియోకి సామ్… “కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయకండి… మీ సామర్థ్యం ఏమిటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు” అని క్యాప్ష‌న్ ఇచ్చింది. ఆమె వీడియోని చూసి షాక్ అయిన‌ కాజ‌ల్‌, పూజా హెగ్డే, న‌మ్ర‌త‌, సుశాంత్ త‌దిత‌ర ప్ర‌ముఖులు స‌మంత అమేజింగ్ అంటూ కామెంట్స్ పెట్టారు.

 

View this post on Instagram

 

Never be afraid to try new things .. you will be surprised at what you’re capable of .. loving parkour @abhinavparkour #mightymouse

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts