• Home
  • Trending Today
  • సమంత స్వయంగా గ్యారంటీ ఇస్తోంది… దేనికో తెలుసా ?
Trending Today సినిమా వార్తలు

సమంత స్వయంగా గ్యారంటీ ఇస్తోంది… దేనికో తెలుసా ?

samantha

వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి నటిగా కూడా ప్రశంసలు దక్కించుకుంటున్న హీరోయిన్ సమంత. ఇటీవల విడుదలైన రంగస్థలం, మహానటి సినిమాలతో పాటుగా అక్కినేని కోడలు అని మంచి గుర్తింపు తెచ్చుకుంది సమంత . తాజాగా ఆమె నటించిన చిత్రం ‘యూటర్న్’. కన్నడ హిట్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంతతోపాటు రాహుల్ రవీంద్రన్, భూమిక, ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా సమంత భర్త నాగచైతన్య నటించిన `శైలజా రెడ్డి అల్లుడు` సినిమా కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనితో వీరిద్దరి మధ్య పోటీ నడుస్తోంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ‘యూ టర్న్’గురించి ఒక వీడియోను విడుదల చేసింది సామ్. ‘‘సెప్టెంబర్ 13న విడుదల కాబోతున్న ‘యూ టర్న్’ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా… మీరు రెండు గంటలు మీరు సీట్‌‌‌లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. దానికి నేను గ్యారెంటీ. ఇది ఒక థ్రిల్లర్ మాత్రమే కాదు.. మిస్టరీ, ఎమోషన్స్ అన్నీ కలగలిపి ఉన్న సినిమా. ఈ సినిమా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. ‘యూ టర్న్’లో కంటెంటే స్టార్. ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ అంతకుముందు ‘లూసియా’ డైరెక్ట్ చేశారు. అప్పటి నుంచి నేను ఆయనకు అభిమానిగా మారిపోయాను. సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి….’’ అని చెప్పింది. 

మరోవైపు నాగచైతన్య సమంత సినిమా కన్నా ముందు నా సినిమానే చూడండి అంటున్నాడు. ఎందుకో కారణం కూడా చెబుతున్నాడు. “ఎందుకంటే సమంత ఈ ఏడాది “రంగస్థలం, మహానటి” వంటి చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అంటుకుంది. కానీ నాకు ఈ ఏడాది ఇదే మొదటి చిత్రం. సమంత కూడా “శైలజారెడ్డి అల్లుడు” చిత్రం చూసింది. తనకు చాలా నచ్చింది… మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది” అంటున్నాడు నాగచైతన్య. మరి మీరు ముందు ఏ సినిమా చూస్తారూ ?

Related posts

'రంగస్థల' సంబరాలలో మెగా కుటుంబం…

admin

సినారె గజల్…

chandra sekkhar

సరి కొత్తగా…

chandra sekkhar

Leave a Comment