telugu navyamedia
telugu cinema news trending

సూర్య మూవీపై కామెంట్‌ చేసిన సమంత..

తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 30న విడుదల అయింది. ఈ సినిమా రిలీజ్‌ అయిన వెంటనే విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాపై చాలా మంది ఇప్పటికే ప్రశంసలు కురిపించారు. తాజాగా.. ఈ సినిమాపై సమంత ఆసక్తికర ట్వీట్‌ చేసింది. ఈ సినిమా యూనిట్‌ పై ప్రశంసల వర్షం కురిపించింది సమంత. ” ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌. ఈ సినిమా ఓ ఆణిముత్యం. సుధా కొంగర డైరెక్షన్‌ అమేజింగ్. సూర్య, అపర్ణ యాక్టింగ్‌ అద్భుతం. నాకు అవసరమైన ప్రేరణ, స్ఫూర్తి ఈ సినిమాలో ఉన్నాయి” అని సమంత ట్వీట్‌ చేసింది.

Related posts

మళ్ళీ నేల చూపులు చూస్తున్న .. బంగారం ధరలు..

vimala p

వైభవంగా కత్రినా కైఫ్ వివాహం… హాజరైన నాగ్, ప్రభు, శివరాజకుమార్

vimala p

సిడ్నీ బతుకమ్మ, దసరా .. సంబరాలు..

vimala p