telugu navyamedia
సినిమా వార్తలు

చిన్మయి తప్పు చేయకపోయినా విమర్శలు ఎదుర్కొంటోంది : సమంత

Samantha-and-CHinmayi

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత, సింగర్ చిన్మయి మంచి స్నేహితురాళ్లన్న విషయం తెలిసిందే. “మీటూ” ఉద్యమంలో భాగంగా సాహిత్య రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల గురించి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో చిన్మ‌యికి స‌మంత మ‌ద్ద‌తు పలికింది. ఈ క్రమంలో చిన్మయికి అవకాశాలు తగ్గాయి. కెరీర్ ప్రారంభం నుంచి సమంతకు డ‌బ్బింగ్ చెబుతోంది చిన్మ‌యి శ్రీపాద. డబ్బింగ్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాధారవిపై కూడా చిన్మ‌యి “మీటూ” ఆరోపణలు చేసింది. దీంతో చిన్మయిని డబ్బింగ్‌ యూనియన్‌ నుంచి తొలగించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో సమంత, చిన్మ‌యి గురించి మాట్లాడింది. “ఇలాంటి నిజాలు బ‌య‌ట‌పెట్ట‌డానికి చాలా ధైర్యం కావాలి. చిన్మ‌యికి ధైరం చాలా ఎక్కువ‌. తాను గ‌తంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి బ‌య‌ట‌పెట్టినందుకు ఆమె విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ఎన్నో అవ‌మానాలు భ‌రిస్తోంది. తమిళనాడు డబ్బింగ్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఎలాంటి తప్పూ చేయని వ్యక్తికి ఇలాంటి సమస్యలు ఎదురుకాకూడదు” అంటూ స‌మంత చెప్పింది. చిన్మయికి సపోర్ట్ చేస్తున్నందుకు గర్వపడుతుంటానని, “మీటూ” ఉద్యమం విదేశాల్లో ప్రారంభమైందని అక్కడ మహిళలు ఒకరికొకరు అండగా ఉన్నారని సమంత చెప్పుకొచ్చింది.

Related posts