telugu navyamedia
సినిమా వార్తలు

“96” తీయకపోతేనే మంచిది అంటున్న సమంత… సమంతకు తెలియదంటున్న దిల్ రాజు

Samantha images
విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం “96”. ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల మనసులను హత్తుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమా రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అప్పట్నుంచి టాలీవుడ్ లో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించబోయే హీరో అల్లు అర్జున్, నాని, గోపీచంద్ అంటూ పలు పుకార్లు షికార్లు చేశాయి. అయితే చివరికి శర్వానంద్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఇక తమిళంలో త్రిష చేసిన పాత్ర కోసం సమంతను ఎంపిక చేసుకున్నారు. 
ఇక గతంలో ఈ చిత్రంపై సమంత స్పందిస్తూ ఇదో అద్భుతమైన చిత్రమని, ఈ చిత్రాన్ని ఎవరూ రీమేక్ చేయకపోవడమే మంచిదని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు వద్ద “96” రీమేక్ పై సమంత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా…. “ఈ సినిమా రీమేక్ హక్కులను ఎవరు కొనుగోలు చేశారో, ఎవరు నటించనున్నారో తెలియక సమంత అప్పట్లో ఆ కామెంట్ చేసుంటారని, అసలు విషయాన్ని ఆమె ఉండరని… అందుకే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని స్పష్టం చేశారు దిల్ రాజు.

Related posts