telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాయిగా కుక్కతో పడుకున్న నాగచైతన్య

samanta

కరోనా ఎఫెక్ట్‌తో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో రకరకాల ఫన్నీ ఇన్సిడెంట్స్‌ని ఫొటోలు, వీడియోలు తీసి.. అభిమానులు ఉత్సాహంలో నింపుతున్నారు. కొందరు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంటే.. మరికొందరు తమకు ఎంతో ఇష్టమైన పెట్స్‌తో సమయాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు హీరో నాగచైతన్య కూడా అదే చేస్తున్నాడు. తన సమయాన్నంతా.. పూర్తిగా కుటుంబంతోనే గడిపేస్తున్నాడు. భార్య సమంతతో పాటు పెట్స్‌కి కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పడు చైతూ డాగ్‌తో ఉన్న ఓ ఫొటోను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. దానికి ఓ అద్భుతమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్‌ అయిపోవడంతో.. చైతూ హాయిగా కుక్కతో ఆడుకుంటున్నాడు. దీన్ని సరదాగా ఫొటో తీసిన సామ్.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో చైతూ నేలపై పడుకుంటే.. అతడిపై కుక్క పడింది. దానికి ‘క్వారంటీమ్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతుంది.

 

View this post on Instagram

 

#quaranteam

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts