telugu navyamedia
telugu cinema news trending

ఇక సినిమాలకు సమంత బ్రేక్ ?

Samnatha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఇంటికి కోడలైనప్పటికీ గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించలేదు. అదే గ్లామర్ తో అదే జోరుతో వరుస సినిమాలు చేసి భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంటోంది. అక్కినేని మూడోత‌రం వార‌సుడు నాగ‌చైత‌న్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత స‌మంత వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తుంది. ఇటీవ‌ల “మజిలీ”, “ఓ బేబి” చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌మంత ప్ర‌స్తుతం “96” రీమేక్ చిత్రంలో న‌టిస్తుంది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వ‌ర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. శ‌ర్వానంద్ చిత్రంలో కెమెరామెన్‌గా క‌నిపించ‌నున్నాడు. సెప్టెంబ‌ర్ 16 నుండి చిత్రానికి సంబంధించి మ‌రో షెడ్యూల్ మొద‌లు కానుంది. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ తొలి వారంలో చిత్ర షూటింగ్ పూర్తి కానుంద‌ని అంటున్నారు. అయితే ఈ చిత్రం త‌ర్వాత స‌మంత ప‌లు ప్రాజెక్టుల‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా, అవన్నీ అవాస్త‌వాలు అంటున్నారు. 96 రీమేక్ త‌ర్వాత కొద్ది రోజుల పాటు స‌మంత సినిమాల‌కి బ్రేక్ తీసుకొని మాతృత్వం పొందేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంద‌ని స‌మాచారం.

Related posts

50 కుటుంబాలకు అండగా… బాపుబొమ్మ

vimala p

“సైరా” సెట్లో అగ్ని ప్రమాదం… స్పందించిన రామ్ చరణ్

vimala p

పవార్ ల మధ్య చిచ్చు పెట్టేసిన … బీజేపీ… పచ్చగడ్డి వేసినా బగ్గుమంటుందే..

vimala p