telugu navyamedia
news telugu cinema news

సీటీమార్’ టైటిల్ సాంగ్ వచ్చేసింది…

మాస్ హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో వస్తున్న చిత్రమిది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశి న‌టిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మధ్యే ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేసారు. దాంతో సినిమా పై అభిమానులు మరింత అంచనాలు పెంచుకున్నారు. ఇక ఈరోజు ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను స్టార్ హీరోయిన్ సమంత లాంఛ్ చేసారు.అయితే ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అప్డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

Related posts

నాగబాబుకు శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్…!

vimala p

23 మంది పిల్లల్ని రక్షించిన.. ఉత్తరప్రదేశ్ పోలీసులు …

vimala p

చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కొత్త బినామీ: ఎమ్మెల్యే ఆర్కే

vimala p