telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అఖిల్ కూడా అందగాడే .. సమంత మెచ్చుగోలు..

samantha praised akhil

అక్కినేని కుటుంబంలో తన భర్త నాగచైతన్య తర్వాత సమంతకు మరిది అఖిల్ అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలో అఖిల్ ఓ వేడుక కోసం వేసుకున్న దుస్తులు చూసి సమంత ఫిదా అయ్యారు. ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ యజమాని తన కళ్యాణ్ రామన్ తన నివాసంలో గ్రాండ్‌గా వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కళ్యాణ్ జ్యువెలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న అఖిల్, అమితాబ్ బచ్చన్, ప్రభు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల్ షేర్వాణీ ధరించి చాలా హ్యాండ్సమ్‌గా తయారయ్యాడు. అఖిల్ లుక్‌పై సమంత కామెంట్ చేస్తూ.. ‘నా మరిది ఎంత అందంగా ఉన్నాడో..’ అన్నారు. ఇందుకు అఖిల్ ఇచ్చిన రిప్లై హైలైట్‌గా నిలిచింది. ‘నా అన్నయ్యంత అందంగా లేనులే వదినా. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ’ అని స్పందించాడు.

తాజాగా నాగచైతన్య, సమంత తమ రెండో మ్యారేజ్ యానివర్సరీని ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే.. అఖిల్ కూడా ఈపాటికి ఓ ఇంటివాడు అయి ఉండేవాడు. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్‌, అఖిల్ ప్రేమించుకున్నారు. నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అఖిల్, శ్రియ విడిపోయారు. ఆ తర్వాత శ్రియ.. ఉపాసన సోదరుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. ఈ విషయంలో కొద్ది రోజులు బాధపడిన అఖిల్.. ఆ తర్వాత సినిమాలపైనే ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు.

Related posts