telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇన్ స్ట్రా గ్రామ్ తో రెచ్చిపోతున్న .. సమంత అక్కినేని

samantha on instagram with huge followers

సామజిక మాధ్యమాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కొత్తగా ఏదైనా వస్తే దానిని వాడేస్తున్నారు, ఎప్పటికప్పుడు తమను ఈ మాద్యమాలద్వారా పరిచయం చేసుకుంటున్నారు, ఇంకా చెప్పాలంటే ప్రమోట్ చేసుకుంటున్నారు. దీనిలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కానేకాదు. ఇటీవల వీరు కూడా తమతమ అభిమానులకు దగ్గరవ్వాలనే కోరికతో, సామజిక మాధ్యమాలలో అందుబాటులో ఉంటున్నారు. దీనితో వాటి ప్రాముఖ్యత విపరీతంగా పెరిగిపోతుంది. ఇక వీటిలో వచ్చే లైక్ లు, షేర్ లు, ఫాలోవర్స్ లాంటివాటికి కూడా ప్రాధాన్యత అంతే పెరిగిపోయింది. ఎవరికి ఎక్కువ ఇవన్నీ ఉంటె వారే ఆ సామజిక మాధ్యమానికి స్టార్ గా ఫీల్ అయిపోతున్నారు. అదేబాటలో తమ అభిమాన వ్యక్తికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని అభిమాని కూడా గర్వంగా చెప్పుకోవటం కొసమెరుపు.

తాజాగా, సమంత ఇన్ స్ట్రా గ్రామ్ పేజీకి 6 మిలియన్ల ఫాలోయర్స్ దాటిన సందర్భంగా ఆమె తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ తన గ్లామర్ లుక్ తో కూడిన మూడు హాట్ ఎక్స్ పోజింగ్ ఫోటోలను తన ఇన్ స్ట్రా గ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. డిజైనర్ వేర్ తో తన సెక్స్ లుక్స్ ను బయటపెడుతూ ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలను చూసి నాగార్జున అభిమానులు అసహనానికి లోనవుతూ ఉంటే నెటిజన్స్ మాత్రం ఆమె గ్లామర్ లుక్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో సమంత క్రియేట్ చేసిన రికార్డ్ ఒక విధంగా మహేష్ అల్లు అర్జున్ లకు షాకింగ్ అనుకోవాలి. టాప్ హీరోలుగా ఎంతో క్రేజ్ ఉన్న మహేష్ అల్లు అర్జున్ లకు ఇన్ స్ట్రా గ్రామ్ లో ఇప్పటి వరకు మూడు మిలియన్ ఫాలోయర్స్ సంఖ్య దాటలేదు. అయితే సమంత వీరిద్దరి కంటే అభిమానుల సంఖ్యలో ముందు ఉండటమే కాకుండా మహేష్ బన్నీలు సమంత రికార్డ్ ను అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది.

samantha on instagram with huge followersప్రస్తుతం సమంత చైతన్యతో కలిసి నటిస్తున్న ‘మజిలి’ సినిమా ద్వారా చైతూకు ఒక భారీ హిట్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇదే కాకుండా నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ‘బేబి’ లో నటిస్తూ నటనపరంగా తనకు ఎదురులేదు అని నిరూపిస్తూ గ్లామర్ పరంగా కూడ ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా తాను ఎప్పటికీ నెంబర్ వన్ అన్న సంకేతాలు ఇస్తోంది. అయితే అందం తాత్కాలికంగా నిలబెడితే, అభినయం శాశ్వతంగా నిలబడుతుందని తెలిసిందేగా!!

Related posts