telugu navyamedia
సినిమా వార్తలు

సమంత కొడుకును, మనవడిని చూశారా ?

Oh-Baby

వివాహం త‌ర్వాత మ‌రింత హుషారుగా సినిమాలు చేస్తున్న అక్కినేని కొసలు స‌మంత ప్ర‌స్తుతం “ఓ బేబీ” సినిమాలో న‌టిస్తోంది. సురేష్ ప్రొడక్ష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. “మిస్ గ్రానీ” అనే కొరియా సినిమా ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రో ఆసక్తిక‌ర పోస్ట‌ర్‌ను స‌మంత ట్విట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. పోస్ట‌ర్‌కు “ఎమోష‌న‌ల్ రోల‌ర్ కోస్ట‌ర్ రైడ్‌కు సిద్ధంకండి” అని క్యాప్ష‌న్ ఇచ్చింది. నా కుమారుడు అంటూ రావు రామేష్‌ను, మ‌న‌వ‌డు అంటూ తేజ‌ను, బెస్ట్ ఫ్రెండ్ అంటూ రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను స‌మంత చూపిస్తున్న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంంటోంది. జూలై 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

Related posts