telugu navyamedia
సినిమా వార్తలు

సమంత సినిమా టైటిల్ చేంజ్

Nandini-reddy-and-Samantha

పెళ్ళి తరువాత సమంత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎక్కువగా ఎంచుకుంటోంది. గత సంవత్సరం విడుదలై భారీ విజయం సాధించిన “రంగస్థలం” సినిమాలో సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో గ్లామర్ తో పాటు డీగ్లామర్ పాత్రలను కూడా పండించగలదని నిరూపించింది సమంత. ఇటీవల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాకు “ఓ బేబీ” అనే టైటిల్ ను అనుకుంటున్నారని “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్ అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే “బేబీ” అనే టైటిల్ ను ఖరారు చేశారని, ట్యాగ్ లైన్ అదేననేది తాజా సమాచారం. ఈ సినిమాలో నాగశౌర్యతో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా నటిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం సమంత “మజిలీ” సినిమాలో నటిస్తోంది.

Related posts