telugu navyamedia
telugu cinema news

పవన్ కళ్యాణ్ పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. ఈ ఏడాది మజిలీ ఓ బేబీ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ “96” రీమేక్ లో నటిస్తోంది. అయితే తాజాగా సమంత పవన్ కళ్యాణ్ కు సంబంధిచిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. “అత్తారింటికి దారేది” సినిమాలో పవన్‌తో కలిసి నటించిన సమంత… ఆ సినిమా షూటింగ్‌లో పవన్ వ్యవహార శైలిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని సమంత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పవన్ గురించి మాట్లాడుతూ ఆయన సిగ్గు చాలా ఎక్కువంది. జనం ఎక్కువగా ఉంటే వారి మధ్యలో షూటింగ్ చేయడానికి పవన్ కొంచెం ఇబ్బంది పడతారని చెప్పింది సమంత. అత్తారింటికి దారేది చిత్రం సందర్భంగా స్విట్జర్లాండ్ షెడ్యూల్ లో ఆయన సిగ్గు చూసి తాను నవ్వాపుకోలేకపోయానని చెప్పింది సామ్. స్విట్జర్లాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఓ పాట షూట్ చేస్తుండగా, చాలామంది జనం వచ్చారని, వాళ్లను చూసిన పవన్ తాను స్టెప్పులు వేయలేనంటూ కారవాన్ వద్దకు వెళ్లిపోయారని సమంత చెప్పుకొచ్చింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్లి “పవన్ నువ్వు చేయగలవు!” అంటూ ఆయనలో కాన్ఫిడెన్స్ నింపారని చెప్పింది. దాంతో “నేను చేయగలనంటావా!” అంటూ పవన్ కాస్త బిడియంగా బెరుకుగా మాట్లాడ్డం చూసి నవ్వుకున్నానని సమంత తెలిపింది. పవన్ పవర్ స్టార్ అయినా ఎంతో సాధారణ మనస్తత్వం ఉన్న వ్యక్తి అనిపించిందని సమంత పవన్‌పై ప్రశంసలు కురిపించింది. ఆ మనస్తత్వమే పవన్ లో తనకు బాగా ఇష్టమైన అంశమని చెప్పుకొచ్చింది సమంత.

Related posts

దర్శకుడి సంచలన ట్వీట్… ఆ సీఈఓ రేప్ చేశాడు…!?

vimala p

అట్టహాసంగా సరిలేరు నీకెవ్వరూ .. ప్రీ-రిలీజ్ ఈవెంట్..

vimala p

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో నిజాలు ఉన్నాయి..అందుకే చంద్రబాబుకు భయం

ashok