telugu navyamedia
సినిమా వార్తలు

సమంత హాట్ పిక్ పై ట్రోలింగ్

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత “మజిలీ”, “ఓ బేబీ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ “96” రీమేక్ లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అక్కినేని కోడలు షేర్ చేసిన ఫొటోలో గ్లామర్ డోస్ ఎక్కువ కావడంతో అదికాస్తా వైరల్ గా మారింది. అంతేనా ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలు అయిన తరువాత ఆమెపై ఫోకస్ పెరిగింది. ఆమె కాస్త పొట్టి బట్టలు వేసుకున్నా… నెటిజన్లు యాక్సెప్ట్ చేయడం లేదు. ఇప్పటికే చాలాసార్లు సమంత తన డ్రెస్సింగ్ విషయంలో ట్రోలింగ్ బారిన పడింది తాజాగా మరోసారి ఈ బ్యూటీని టార్గెట్ చేశారు. తన భర్త నాగచైతన్య కొందరు స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్ర కోసం స్పెయిన్ వెళ్లింది సామ్. సముద్ర తీర ప్రాంతంలో సేద తీరుతూ ఓ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు ఆ ఫోటోను తన భర్తే తీసినట్లు చెప్పింది. కానీ ఇందులో సామ్ డ్రెస్ మరీ చిన్నదిగా ఉండడంతో ఆమెపై నెగెటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. పద్ధతి, సంప్రదాయం అంటూ క్లాస్ పీకుతున్నారు. ఎవరెంత గోల చేసినా సమంత మాత్రం నా ఇష్టం నాది అన్నట్టుగా ఉంటుంది. అసలామె ఈ ట్రోలింగ్ పట్టించుకొనే పట్టించుకోదు.

 

View this post on Instagram

 

Pc @chayakkineni 💚

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts