telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ సినిమా హిట్ అయినందుకు .. అరగంట ఏడ్చేశాను.. : సమంత

Samantha images

నాగచైతన్య, సమంత దంపతులు ‘మజిలీ’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. పెళ్లయ్యాక చై, సామ్‌ నటించిన తొలి చిత్రమిది. అయితే ఈ సినిమా మొదటి రివ్యూ చదివినప్పుడు ఎంతో ఏడ్చానని అంటున్నారు సమంత. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మజిలీ’ సినిమా విజయం చై కెరీర్‌కు ఎంతో కీలకం. ‘మజిలీ’ విడుదల రోజున నేను ఉదయం 2.30 గంటలకు నిద్రలేచాను. సినిమా హిట్టవ్వాలని గంటన్నర పాటు పూజలు చేస్తూనే ఉన్నాను.

ఆన్‌లైన్‌లో సినిమా బాగుందంటూ వచ్చిన ఫస్ట్‌ రిపోర్ట్‌ చూసి అరగంట సేపు ఏడ్చాను. మొత్తానికి సినిమా విజయం సాధించినందుకు ఊపిరి పీల్చుకున్నాను’ అని వెల్లడించారు. శివ నిర్వాణ ‘మజిలీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా రూ.40 కోట్ల వసూళ్లు రాబట్టింది. త్వరలో సమంత ‘96’ సినిమా రీమేక్‌లో నటించనున్నారు. మరోపక్క నాగచైతన్య తన మేనమామ వెంకటేశ్‌తో కలిసి ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు.

Related posts