telugu navyamedia
సినిమా వార్తలు

రాధారవికి సమంత కౌంటర్… నయన్ కు మద్దతు

samantha-and-radharavi

దక్షిణాది స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతారను ఉద్దేశిస్తూ తమిళ సీనియర్ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోలీవుడ్ మొత్తం నయనతారకు మద్దతుగా నిలిచి, రాధారవిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార కూడా రాధారవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ వివాదంపై స్పందిస్తూ రాధరావికి గట్టి కౌంటర్ ఇచ్చింది. “‘మిస్టర్ రాధారవి… కష్టమనేది ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. మీరు చాలా బాధపడుతున్న వ్యక్తి. అందుకు మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తుంది. మీకు ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాం. నయనతార తర్వాత సూపర్ హిట్ సినిమా టికెట్లు మీకు కొనిస్తాం. పాప్ కార్న్ తింటూ ఆస్వాదించండి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. సమంత పోస్ట్ పై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ వివాదంతో రాధారవిని తన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు ఆయనను ఇకపై తన సినిమాల్లో తీసుకోబోమంటూ ఓ నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Related posts