• Home
  • Trending Today
  • నెటిజన్ కు సమంత కౌంటర్… నీ కూతురు అడిగితే…!?
Trending Today సినిమా వార్తలు

నెటిజన్ కు సమంత కౌంటర్… నీ కూతురు అడిగితే…!?

samantha

ప్రస్తుతం మీటూ ఉద్యమానికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. అయితే మీటూ అనే హ్యాష్ ట్యాగ్ కి ఎంత మద్దతు లభిస్తున్నప్పటికీ కొందరు మాత్రం సాక్ష్యాధారాలు అడుగుతూ… అప్పుడే ఎందుకు చెప్పలేదు ? అంటూ బాధితులపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. సమంత కి ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. అయితే సదరు నెటిజన్ కు ఆమె తన ప్రశ్న ద్వారా బాగానే చురకంటించారు.

రెండ్రోజుల కిందట చిన్మయి శ్రీపాద చిన్నప్పుడు తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు మద్దతిస్తూ సమంత ట్వీట్ చేశారు. అయితే ఇద్దరు నెటిజన్స్ మాత్రం సమంతను విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. ఒక నెటిజన్ “పదేళ్ల కిందట జరిగిన వివాదం గురించి ఇప్పుడు చెబితే ఎలా ఒప్పుకుంటారు?” అని అడిగాడు. అందుకు సమంత “ఇదే మా భయం… ఎవరూ వెంటనే నిజం ఒప్పుకోరు కాబట్టే సమయం వచ్చినప్పుడు నిజాల్ని బయటకు చెబుతుంటాం” అన్నారు.

ఇక మరో నెటిజెన్ “ఇవాళ మా కొడుకు మీటూ అంటే ఏమిటని అడిగాడు. అందుకు నేను ఆడవారి రిటర్మెంట్ ఇన్సూరెన్స్ పథకమని అన్నాను… ఎందుకంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చే ఆడవాళ్లు కెరీర్ ఎండ్ అయ్యాక ఈ భీమా వాడుకుంటారు. అప్పుడు మీడియా న్యూస్ అందిస్తుంది అని చెప్పగానే మా అబ్బాయి గాడ్ బ్లెస్‌ ఇండియా అన్నాడని సమంతకు ట్వీట్ చేశాడు. దీంతో సమంత అతనికి కొంచెం గట్టిగానే చురక అంటించింది. “ఇదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం సమాధానం ఇస్తావు ?” అంటూ సమంత ప్రశ్నించారు.

Related posts

దీపికా పదుకొనె యాసిడ్ బాధితురాలా ?

vimala t

హాలీవుడ్ ప్రముఖ నటిని కాల్చి చంపిన పోలీసులు…!?

vimala t

గుర్లిన్ చోప్రా "రౌడీ పోలీస్"

admin

Leave a Comment