telugu navyamedia
సినిమా వార్తలు

“జానకీదేవి”గా సమంత…?

Samantha images

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన “96” చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, శర్వానంద్ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథల్లో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ సినిమాకు జాను లేదా జాను అలియాస్ జానకి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే “జానకీదేవి” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారనేది తాజా సమాచారం. ఈనెల 6న శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ లోగోను విడుదల చేయనున్నారని టాక్. ఇక సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను త్వరలోనే ముగించుకుని, ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం నాగచైతన్య, సమంత జంటగా “మజిలీ” చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రదర్శకుడు “మజిలీ” చిత్రంలో శ్రావణిగా నటిస్తున్న సమంత తన నటనతో మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, షాక్ కు గురి చేస్తుంది” అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన సమంత భర్త నాగచైతన్య “అవును నిజమే…” అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన సమంత రెండు లవ్ సింబల్ ఎమోజీలతో “థాంక్యూ హస్బెండ్” అంటూ రొమాంటిక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సెలబ్రిటీ కపుల్ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts