telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి వెండితెరపై జంటగా శర్వానంద్, సమంత ?

Sam

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , చెన్నై చంద్రం త్రిష జంటగా నటించిన త‌మిళ చిత్రం “96” చిత్రానికి విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన “96” చిత్రంకి రీమేక్‌గా తెలుగులో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న‌ సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌లో 34వ చిత్రంగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌, స‌మంత ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోను డైరెక్ట్ చేస్తున్నాడు. చిత్రంలో శ‌ర్వానంద్ ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర‌లో కనిపించ‌నుండ‌గా, ఆయ‌న గర్ల్‌ఫ్రెండ్ పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో మరో సినిమాలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. `ఆర్‌ఎక్స్100` సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి `మహాసముద్రం` పేరుతో ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను చాలా మంది హీరోలకు వినిపించాడు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆయన వరుస సినిమాలతో బిజీ కావడంతో ఈ సినిమాకు సమయం కేటాయించలేకపోయాడు. దీంతో చివరికి యంగ్ హీరో శర్వానంద్ ఈ కథను ఓకే చేశాడట. నాగచైతన్యను హీరోగా అనుకున్నప్పుడు హీరోయిన్‌ పాత్రకు సమంతను తీసుకోవాలని దర్శకుడు అనుకున్నాడట. అప్పుడే సమంతకు కూడా కథ చెప్పాడట. ఆమెకు కథ నచ్చింది. దీంతో ఇప్పుడు హీరో మారినా హీరోయిన్‌గా సమంతనే తీసుకోబోతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

Related posts