telugu navyamedia
సినిమా వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చై-సామ్

Samantha-and-Naga-Chaitanya

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సమంత పెళ్లి త‌ర్వాత జంట‌గా తొలిసారి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సినిమా “మజిలీ”. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మాణంలో రూపొందిన “మ‌జిలీ” చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో స‌మంత‌తో పాటు దివ్యాన్ష కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ శ్రీవారి దర్శనార్థం సోమవారం తిరుమల చేరుకుంది.

ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆశీర్వాదం పొందేందుకు నాగచైతన్య, బ్రహ్మానందం వాహనంలో తిరుమలకు రాగా, సమంత మాత్రం కలిబాటన వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మార్గంలో ఆమెను గుర్తించిన యాత్రికులు, అభిమానులు సమంత పక్కన నడుస్తూ సెల్ఫీలు దిగారు. ఇక సోమవారం తిరుపతికి వెళ్లిన చై- సామ్ జోడీ కొద్దిసేపటి క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుపురంగు దుస్తుల్లో నాగచైతన్య, సంప్రదాయ దుస్తుల్లో సమంత కనిపించారు. పెళ్ళైన తరువాత మొదటిసారిగా చై-సామ్ కలిసి నటిస్తున్న చిత్రం “మజిలీ” కావడంతో… ఈ చిత్రం విడుదల గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Related posts