telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రతి రోజూ నీ ఆనందం కోసమే ప్రార్థిస్తాను… చైతన్యకు సమంత శుభాకాంక్షలు

chai

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య, స్టార్ హీరోయిన్‌ సమంత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం గోవాలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న చై సామ్‌, ఓ రొమాంటిక్‌ ఫోటోను అభిమానుల కోసం ట్వీట్ చేశారు. చైతూతో సమంత కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసి సమంత “పుట్టిన రోజు శుభాకాంక్షలు చై. నేను ప్రతి రోజూ నీ ఆనందం కోసమే ప్రార్థిస్తాను. నువ్వు ప్రతి రోజు సరికొత్తగా నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవటం నాకు గర్వంగా ఉంది. ఐ లవ్‌ యూ డార్లింగ్‌ హజ్బెండ్‌” అంటూ కామెంట్ చేసింది సమంత. ఇక అఖిల్ కూడా అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. “ఈ పుట్టిన రోజున నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. అందుకు నువ్వు అర్హుడివి. నువ్వు ఎప్పుడు మంచి అన్నవి. లవ్‌ యూ సోమచ్‌ మై మ్యాన్‌” అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు హీరో రానా దగ్గుబాటి కూడా తన బావమరిది చైతన్యకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇంకా పలువురు సెలెబ్రిటీలు, అక్కినేని అభిమానులు కూడా సోషల్ మీడియాలో నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related posts